బొమ్మరిల్లు భాస్కర్-అక్కినేని అఖిల్ కాంబినేషన్ లో సెట్ మీదకు వెళ్లాల్సి వుందో సినిమా. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి. కాస్టింగ్ వర్క్ మొదలైంది. కీలకమైన ఓ పాత్రకు దర్శకుడు, నటుడు సముద్రఖనిని తీసుకుంటున్నారు. తమిళ సినిమాల ద్వారా సముద్రఖని నటుడిగా మన ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం అయ్యారు.

డైరక్ట్ గా తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. అఖిల్ పాత్రకు తండ్రిగా సముద్రఖని రెండో సినిమా అంగీకరించారు. ఇప్పటి వరకు ప్రకాష్ రాజ్, రావురమేష్, రాజేంద్ర ప్రసాద్, సత్యరాజ్ లే ఇలాంటి పాత్రలకు వున్నారు. ఇప్పుడు సముద్రఖని కూడా తెలుగులో బిజీ అయ్యే అవకాశం వుంది.

బొమ్మరిల్లు భాస్కర్ కీలకమైన ఎమోషనల్ పాత్రలను తయారుచేస్తారు తన సినిమాల్లో. గతంలో ప్రకాష్ రాజ్ మూడు సినిమాల్లో బొమ్మరిల్లు భాస్కర్ తో పనిచేసారు. మరి ఇప్పుడు సముద్రఖని కోసం ఎలాంటి పాత్ర తయారు చేసారో చూడాల్సి వుంది.