యూత్ ఫుల్ హీరో నిఖిల్, సక్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ చందు మొండేటి కాంబినేష‌న్ లో కార్తీకేయ 2 చిత్రం ఇటీవ‌లే తిరుప‌తిలో లాంఛ‌నంగా ప్రారంభమైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ నుంచి కార్తికేయ 2 షూటింగ్ ని మొద‌లుపెట్ట‌డానికి లొకేష‌న్స్ రెక్కీని ప్రారంభించారు ద‌ర్శ‌కుడు చందుమొండేటి, సినిమాటోగ్రాఫ‌ర్ కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని. దీనికి సంబంధించిన ఫొటోల‌ను, తాజాగా చిత్ర బృందం విడుద‌ల చేసింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పిపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాక‌త్మంగా నిర్మిస్తున్నాయి. ఈ థ్రిల్లింగ్ ఎంట‌ర్ టైన‌ర్ కు టీ.జి విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాత‌లు.