అందరికి నమస్కారం 

ఈ కరోనా వైరస్ నియంత్రించడానికి క్షేత్ర స్థాయిలో అహర్నిశలు సేవాభావంతో 24 గంటలు పనిచేస్తున్న డాక్టర్లకి, నర్సులకి, ఇతర వైద్యఆరోగ్య  బృందానికి, స్వచ్ఛ కార్మికులకు, పోలీస్ శాఖ వారికి, ఆయా ప్రభుత్వాలకి మనం హర్షాతిరేకం ప్రకటిస్తూ ప్రశంసించాల్సిన సమయం ఇది. 

 

దేశప్రధానమంత్రి పిలుపుకు స్పందిస్తూ ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మనందరం జనతా curfew పాటిద్దాం.ఇళ్లకే పరిమితం అవుదాం.  సరిగ్గా 5 గంటలకు మన గుమ్మల్లోకి వచ్చి, చప్పట్లతో ప్రతి ఒక్కరం సేవలందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలపాల్సిన సమయం ఇది. అది మన ధర్మం. భారతీయలుగా మనందరం ఐకమత్యంతో ఒక్కటిగా నిలబడి ఈ క్లిష్ట పరిస్థితులని ఎదుర్కొందాం. సామాజిక సంఘీభావం పలుకుదాం. కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం. జై హింద్.