మాస్ మహరాజా రవితేజ డాన్ గా మారిపోయారు. ఆయన కొత్త మూవీ డిస్కో రాజా లోని ఆయన డాన్ లుక్ కేకపుట్టిస్తుంది. ఎర్ర సూటు, కళ్ళజోడు ధరించి, చెంప పట్టీలు, ఫ్రెంచ్ గడ్డం మరియు ఒక చేతిలో పిస్టల్, మరో చేతిలో సిగార్ తో రవితేజ 90ల కాలం నాటి డాన్ లుక్ ఆకర్షణీయంగా ఉంది. వినాయక చవితి కానుకగా విడుదల చేసిన రవితేజ లుక్ మూవీపై అంచనాలు పెంచేదిగా ఉంది.

వి ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ కథగా రూపొందుతుంది. పాయల్ రాజ్ పుత్ రవితేజ సరసన నటిస్తుండగా, రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ లో విడుదల కానుంది.