‘దూకుడు, లెజెండ్, పవర్’ లాంటి హిట్ చిత్రాల నిర్మాత అనిల్ సుంకర వరుస ప్రాజెక్ట్స్ నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నిర్మిస్తున్న మూడు చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. వాటిలో మహేష్ బాబు, అనిల్ రావిపూడిల కలయికలో రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ భారీ ప్రాజెక్ట్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు మరోసారి స్పష్టం చేశారు అనిల్ సుంకర.

అలాగే గోపిచంద్, దర్శకుడు తిరులతో చేస్తున్న స్పై థ్రిల్లర్ ‘చాణక్య’ను దసరా కానుకగా విడుదల చేస్తామని అలాగే అల్లరి నరేష్ హీరోగా పివి గిరి డైరెక్షన్లో రూపొందింస్తున్న కామెడీ ఎంటెర్టైనర్ ‘బంగారు బుల్లోడు’ చిత్రాన్ని ఈ దీపావళి విడుదలకు సిద్దం చేస్తున్నామని ప్రకటించారు. ఇలా మీడియమ్ బడ్జెట్ నుండి భారీ బడ్జెట్ వరకు ఒకేసారి మూడు సినిమాల్ని నిర్మిస్తూ బ్యాక్ టూ బ్యాక్ ప్రేక్షకులకు అందివ్వడానికి ఒకే నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ కృషి చేస్తుండటం నిజంగా అభినందనీయం.