ద‌స‌రా బ‌రిలోకి  గోపీచంద్ `చాణ‌క్య‌`

వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా `చాణ‌క్య` యూనిట్ ప్రేక్ష‌కుల‌కు వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌ల‌ను తెలిపారు. మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ `చాణక్య‌`. తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ఇట‌లీ, మిలాన్‌లో  పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది.అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ద‌స‌రాకు విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. గోపీచంద్ స‌ర‌స‌న మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి కెమెరామెన్‌.
 
నటీనటులు: 
గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ తదితరులు

సాంకేతిక వర్గం: 
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు
ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గిరికిపాటి
కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర
మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి
రైటర్: అబ్బూరి రవి
ఆర్ట్: రమణ వంక
కో డైరెక్టర్: దాసం సాయి, రాజ్ మోహన్