మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా లో అంతగా యాక్టీవ్ గా ఉండరనే చెప్పాలి. దీనితో చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియా వేదికలైన ట్విట్టర్,ఇంస్టాగ్రామ్ లలో ఆమె అప్ డేట్స్ తో పాటు, చరణ్ మూవీ అలాగే పర్సనల్ అప్ డేట్స్ కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఐతే రామచరణ్ నేడు అధికారికంగా ఇంస్టాగ్రామ్ ఖాతాని తెరిచారు. ఐతే గతంలో చరణ్ కి ట్విట్టర్ ఖాతా ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాలతో దానిని డిలీట్ చేయడం జరిగింది. ఇప్పుడు చరణ్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అందుబాటులోకి రావడంతో తన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారట.