అతి తక్కువ కాలంలో తెలుగులో స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకున్న నటి రష్మిక మందన్న. ప్రస్తుతం మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి భారీ చిత్రంలో నటిస్తున్న ఈమెకు మరొక గోల్డెన్ ఛాన్స్ దక్కిందని టాక్. అది కూడా హిందీ పరిశ్రమలో కావడం విశేషం.

తెలుగు సూపర్ హిట్ చిత్రం ‘జెర్సీ’ని హిందీలోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత
కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. అతనికి జోడీగా రష్మిక మందన్నను తీసుకుంటే బాగుంటుందని కరణ్ జోహార్ భావిస్తున్నారట. దాదాపు ఆమెనే ఖాయం చేసినట్టు తెలుస్తోంది. షాహిద్ కపూర్ గత చిత్రం ‘కబీర్ సింగ్’ భారీ హిట్ కావడంతో ‘జెర్సీ’ హిందీ రీమేక్ పెద్ద ప్రాజెక్ట్ కానుంది. అలాంటి సినిమాతో హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం రావడం నిజంగా రష్మికకు పెద్ద లక్ అనే అనుకోవాలి.