‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయం అయింది గ్లామర్ బ్యూటీ ‘నాభ నటేష్’. ఆ తరువాత ఇస్మార్ట్ శంకర్ లో కథానాయకిగా నటించి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో గ్లామర్ తో యూత్ ని బాగా ఆకట్టుకుంది ఈ కన్నడ భామ. అయితే నాభ నటేష్ వినాయక చవితి సందర్భంగా తనలోని మరో కొత్త యాంగిల్ ని చూపించింది. మట్టి ఇసుకతో అద్భుతమైన వినాయకుని ప్రతిమ చేసి.. పైగా ఆ విగ్రహాన్ని అందమైన డిజైన్ తో తీర్చిదిద్దటంతో పాటు.. ఒక ప్రొఫెషనల్ చేసినట్లుగా వినాయకుని ఐడిల్ ను తయారుచేయడంతో.. నెటిజన్లు నాభ టాలెంట్ కి ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

ఇక నాభ నటేష్ కమర్షియల్స్ సినిమాల మీద దృష్టి పెట్టిందట. ఇస్మార్ట్ శంకర్ తో మంచి విజయం సాధించాక వరుస ఆఫర్లు వస్తోన్నా.. ఓన్లీ క్రేజీ ప్రాజెక్ట్స్ కే ఒకే చెబుతుందట. మొత్తానికి నాభ ముందు చూపు అండ్ ఆమెలోని టాలెంట్ ని చూసిన వారు.. నాభ నటేష్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉందంటున్నారు, ప్రస్తుతం నాభ నటేష్, వి ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తోంది.