సాహో చిత్రం విడుదల ఐనప్పటినుండి పలు రకాల స్పందన వస్తుంది. మొదట నెగటివ్ ప్రచారం బాగానే జరిగిందని చెప్పాలి. కానీ సాహో చిత్రం సరి యైన కంటెంట్ తో ప్రేక్షకులని అలరిస్తుందని చెప్పాలి. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లో సాహ్హో కలెక్షన్ ల వివరాలను వెల్లడించింది. ఐదు రోజుల్లో 350 కోట్ల మార్క్ ని దాటి ప్రస్తుతం లాభాల బాటలో ఉందని అర్ధం అవుతుంది. సినిమాకి పెట్టిన అమౌంట్ రావడం తో చిత్ర యూనిట్ ఇక హ్యాపీ అనే చెప్పాలి. పలు రకాల కారణాలతో సినిమా తొక్కేయాలని చాలామంది చూసారు. కానీ ప్రభాస్ కి ఇంకా తిరుగులేదని ఈ చిత్రం తో వారికీ అర్ధం ఐంది.

ప్రభాస్ ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాన్ని రాధా కృష్ణ తో చేసేలా వున్నదని సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో చిత్రం తర్వాత ప్రభాస్ చేస్తున్న చిత్రం. ముందు చెప్పినట్లుగానే ఇక భారీ చిత్రాల జోలికి వెళ్లకుండా వున్నారు. కానీ మరి ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి విషయాలను చిత్ర యూనిట్ తెలిపే వరకు చెప్పలేం. ఏదేమైనా ప్రభాస్ అంటే ఇపుడు తెలుగు సినిమా రేంజ్ ని పెంచిన నటుడు అని చెప్పుకోవచ్చు.