దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి లాంటి లాంటి సినిమాల తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నటువంటి చిత్రం RRR. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఇద్దరు కూడా కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు… కొమురం భీం గా ఎన్టీఆర్, అల్లూరిసీతారామరాజు గా రామ్ చరణ్ కనిపించనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ ప్రస్తుతానికి శరవేగంగా జరుగుతుంది. కాగా చెప్పిన సమయానికే సినిమాని ప్రేక్షకులముందుకు తీసుకరావడానికి రాజమౌళి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ బల్గెరియాలో జరుగుతుంది. కాగా కొమురంభీం అనే పోరాట యోధుడి పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ ప్రస్తుతానికి బల్గెరియాలో జరిగే పోరాట సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ పూర్తిగా యాక్షన్‌ సీక్వెన్స్‌ రూపొందిస్తున్నారు.    
కాగా ఆతరువాత హైదరాబాద్ లో జరిగే చిత్రీకరణలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నటువంటి రామ్‌ చరణ్‌ కూడా పాల్గొననున్నాడు. అయితే ఈ షెడ్యూల్ మాత్రం రామోజీ ఫిలిం సిటీలో జరగనుందని సమాచారం. ఇకపోతే త్వరత్వర ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ ని పూర్తీ చేసి ఆ తర్వాత విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు మొదలు పెట్టనున్నారు. కాగా చాలా కసరత్తులు చేసిన తరువాతే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు దర్శక నిర్మాతలు…