హరీష్ శంకర్ 2006లో రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా తెరకెక్కిన షాక్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. రవి తేజ, జ్యోతిక హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఆ చిత్రం నిజంగా హరీష్ కి పెద్ద షాక్ ఇచ్చింది. ఆ చిత్రం విడుదలైన ఐదేళ్లకు తర్వాత మళ్ళీ రవి తేజతో మిరపకాయ్ చిత్రం తీసి, హిట్ కొట్టాడు. ఇక మూడవ చిత్రంగా ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చిత్రం చేశే అవకాశం దక్కించుకున్నాడు. హిందీలో సల్మాన్ ఖాన్ చేసిన దబాంగ్ చిత్రాన్ని తెలుగులో గబ్బర్ సింగ్ గా హరీష్ తెరకెక్కిచడం జరిగింది. పేరుకు రీమేక్ అయినా హరీష్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని దాదాపు కొత్తగా తెరకెక్కించాడు.

గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని పవన్ పరాజయాలకు అడ్డుకట్టవేసింది. ఈ విజయంతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా హరీష్ మారిపోయాడు. ఐతే హరీష్ మళ్ళీ ఆ స్థాయి హిట్ మాత్రం అందుకోలేదు. అందుకే కలిసొచ్చిన సెంటిమెంట్ ని నమ్ముకొని మరో మారు రీమేక్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ హీరోగా ఆయన చేస్తున్న వాల్మీకి చిత్రం తమిళ చిత్రం జిగర్తాండ కు తెలుగు రీమేక్. మెగా హీరోతో మరో రీమేక్ చేసి గబ్బర్ సింగ్ సెంటిమెంట్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు హరీష్. గబ్బర్ సింగ్ మాదిరి వాల్మీకి చిత్రంలో కూడా హరీష్ చాలా మార్పులు చేశారని తెలుస్తుంది.

వరుణ్,పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 20న విడుదల కానుంది. 14 రీల్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్ అందిస్తున్నారు.