ర‌వికిర‌ణ్ ద‌ర్శ‌కత్వంలో కిర‌ణ్ అబ్బావ‌ర‌మ్‌, ర‌హ‌స్య‌ గోర‌క్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం ‘రాజావారు రాణిగారు’. ఎస్ఎల్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై డి. మ‌నోవికాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్ర టీజ‌ర్ ను సోమ‌వారం ప్ర‌సాద్‌ ల్యాబ్స్‌ లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా విలేక‌రుల స‌మావేశంలో… ప్రొడ్యూస‌ర్ డి. మ‌నోవికాస్ మాట్లాడుతూ.. ‘ఇదొక మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌ టైన‌ర్‌. క‌థ విన్నాక బాగా న‌చ్చి నేనే ప్రొడ్యూస్ చేశాను. హీరో కూడా చాలా బాగా చేశారు. హీరోయిన్ కూడా బాగా క‌ష్ట‌ప‌డింది. నాకు ఈ సినిమాతో ఒక మంచి సిస్ట‌ర్‌లా అయిపోయింది. సినిమా యూనిట్ అంతా బాగా చేశారు.

ద‌ర్శ‌కుడు ర‌వి మాట్లాడుతూ… మీ అంద‌రికీ టీజ‌ర్ బాగా న‌చ్చింది అనుకుంటున్నాను. ఈ మూవీ మీ అంద‌రికి ఒక ఫ్రెష్ అనుభ‌వాన్ని ఇస్తుంది అని అన్నారు.
హీరో మాట్లాడుతూ… మూవీ చాలా బాగా వ‌చ్చింది. టీమ్ అంద‌రం బాగా హ్యాపీగా ఉన్నాం అని అన్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ : జేక్రిష్‌, సినిమాటోగ్ర‌ఫీ : విద్యాసాగ‌ర్ చింటా, అమ‌ర్‌ దీప్‌ గుట్ట‌ల‌, ఎడిటింగ్ : విప్ల‌వ్ నైష‌డ‌మ్‌,