ఒకేసారి రెండు మూడు సినిమాలను అంగీకరించేందుకు హీరోలు ఇబ్బంది పడుతున్నారు. ఒక సీన్మా పూర్తయిన తర్వాతే మరో సినిమా గురించి ఆలోచిద్దాం అని భావిస్తున్నారు. ఎందుకంటే సినిమా సినిమాకు లెక్కలు మారుతున్నాయి. ఎంతటి చరిత్ర ఉన్నప్పటికీ ఒక సినిమా ఫ్లాప్‌ అయితే మళ్లి పుంజుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తోంది. అందుకే తదుపరి సినిమా గురించి వారు ఆలోచించడం లేదు. కొందరి హీరోలకైతే ఈ కారణంగానే గ్యాప్‌ వస్తోంది. సరైన కథ దొరికితేనే చేస్తామంటున్నారు. లేదంటే కథలు వింటూనే ఉంటామని చెబుతున్నారు.
సక్సెస్‌ఫుల్‌ హీరో, నేచురల్‌ స్టార్‌ నాని కొత్త సినిమా గురించి ఇదే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం గ్యాంగ్‌లీడర్‌లో నటిస్తున్నారు. ఈ నెల 13న ఈ సినిమా విడుదలకానుంది. మరోవైపు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వి అనే సినిమా చేస్తున్నారు. దీని తర్వాత ఆయన ఎవరి సినిమా చేస్తారు? అనేది సస్పెన్స్‌గా మారింది. అనేక మంది దర్శకులు కథలు చెప్పారట. నాని దగ్గర నుండి ముాెత్రం గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదని అంటున్నారు. తాజాగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో నటించే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఇటీవలే నాగార్జునతో మన్మథుడు 2 సినిమా తీసిన రాహుల్‌ నానికి చెప్పిన కథ దాదాపుగాఓకే అయినట్టు  ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.