చిక్కుల్లో స్టార్ హీరో మూవీ, విడుదల వాయిదా.

హీరో ధనుష్, మేఘా ఆకాష్ జంటగా తెరకెక్కిన తాజా చిత్రం ఎనై నోకి పాయం తోట. విలక్షణ దర్శకుడుగౌతమ్ మీనన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు.ఐతే ఈ చిత్ర విడుదల వాయిదా పడినట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ఈనెల 6న విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఐతే చెప్పిన తేదీన థియేటర్లలో దిగే అవకాశం లేదని తెలుస్తుంది.

ఈ చిత్రం కొన్ని లీగల్ సమస్యలలో చిక్కుకున్నట్లు సమాచారం. దీనితో వచ్చే శుక్రవారం ఎనై నోకి పాయం తోట విడుదల వాయిదా పడింది. చిత్ర యూనిట్ ఒకరోజు ఆలస్యంగానైనా అంటే, శనివారం విడుదల చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ చిత్రం తూటా పేరుతో విడుదల కానుంది. కాగా ఇటీవల ధనుష్ తమిళ నిర్మాతలపై చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ధనుష్ చిత్రానికి ఇలాంటి సమస్యలు రావడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది.