యంగ్ హీరో నాని హీరోగా వెండితెరకు పరిచయం అయి పదకొండేళ్లు అవుతుంది. నాని హీరోగా తెరకెక్కిన తొలి సినిమా అష్టా చమ్మా రిలీజ్‌ అయి నేటికి పదకొండేళ్లు. ఈ సందర్భంగా నాని తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘అష్టా - చమ్మా రిలీజ్ అయ్యి పదకొండేళ్ళు.... నా నుండి మీ అయ్యి పదకొండేళ్ళు. ఇంత పెద్ద కుటుంబానికి థ్యాంక్యూ అనేది చాలా చిన్న పదం. ఇంకా మరిన్ని సంవత్సరాల పాటు ఈ అనుబంధం కొనసాగాలని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు.
ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా అడుగుపెట్టి ప్రస్తుతం నేచురల్‌ స్టార్‌గా తనకంటూ స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు నాని. ప్రస్తుతం నాని, విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో గ్యాంగ్‌ లీడర్‌ సినిమాలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు.