‘తిరుగుబోతు’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైన రాజ్‌ సూర్యన్‌ నటించిన తాజా చిత్రం ‘నా పేరు రాజా’. ‘ఈడో రకం... డెఫినెట్లీ డిఫరెంట్‌’ అనేది ఉపశీర్షిక. ఆకర్షిక, మోడల్‌ నస్రీన్‌ హీరోయిన్లుగా నటించారు. అశ్విన్‌ కృష్ణ దర్శకత్వంలో అమోఘ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై రాజ్‌ సూరియన్, ప్రభాకర్‌ రెడ్డి, కిరణ్‌ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 65 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశాం. ఈ చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌ ‘రాజా రాజా మన్మథ రాజా.. ఆజా ఆజా నా రాజా...’ పాటను కొరియోగ్రాఫర్‌ నగేష్‌ హాలీవుడ్‌ స్టైల్‌లో చిత్రీకరించారు. సాహితీ రాసిన ఈ పాటను మోహనా భోగరాజు చక్కగా పాడారు. అక్టోబర్‌లో పాటలు, నవంబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.  ప్రభు సూర్య, ఆయుశ్రీ, ఇరాన్, అవా సఫాయి, ఆరాధ్య తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎ.వెంకట్‌.