మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్నటువంటి భారీ బడ్జెట్ చిత్రం సైరా నరసింహారెడ్డి… కాగా ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు… మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నారు. కాగా ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. అంతేకాకుండా బాలీవుడ్ నుంచి అమితాబ్, కన్నడ నుంచి సుదీప్, తమిళ్ నుంచి విజయ్ సేతుపతి ఇందులో కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటు తమన్నా, జగపతిబాబు, రవి కిషన్ కూడా నటించారు. కాగా ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు… కాగా ఈ చిత్రం అటు తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదలయ్యేందుకు సిద్దమవుతుంది…

కాగా ఈ చిత్రం దసరా పండగ సమయంలో వస్తుండటంతో భారీగా ఓపెనింగ్స్ వస్తాయని అందరు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదలవడానికి మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు నిర్మాతలు. కాగా ఈనెల 15 లేదా 17న సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా కర్నూల్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పవన్ కళ్యాణ్ తో పాటు రజిని కాంత్ ని గెస్టులుగా పిలవనున్నారని సమాచారం. తెలుగు రాష్ట్రాలతో పాటే మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు…