అల్లు అర్జున్ నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం తరువాత ఏడాదికి పైగా విరామం తీసుకున్నారు. విరామం తీసుకున్నారు అనడం కంటే వచ్చింది అని చెప్పాలి. ఆ చిత్ర పరాజయం తరువాత ఆయన తదుపరి సినిమా ఎంపిక విషయంలో బాగా అలోచించి నిర్ణయం తీసుకున్నారు. అందుకే బన్నీ నెక్స్ట్ మూవీ సెట్స్ పైకి తీసుకెళ్లాడని చాలా టైం తీసున్నాడు.

ఇక బన్నీ త్రివిక్రమ్ తో చేస్తున్న అల వైకుంఠపురంలో షూటింగ్ దశలో ఉండగా, సుకుమార్ తో చేయనున్న చిత్ర షూటింగ్ కి ముహూర్తం ఖరారైంది. ఈచిత్రాన్ని వచ్చే నెల 3న పూజ కార్యక్రమాలతో ప్రారంభించనున్నారని సమాచారం.విశేషం ఏమిటంటే త్రివిక్రమ్, సుకుమార్ లకి ఇవి బన్నీతో చేస్తున్న మూడవ చిత్రాలు కావడం.

గతంలో త్రివిక్రమ్ బన్నీతో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి చేయగా ఆ రెండు మంచి విజయాన్ని అందుకున్నాయి.ఇక తాజా చిత్రం అల వైకుంఠపురంలో కూడా త్రివిక్రమ్ పక్కా ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడని సమాచారం.

ఇక బన్నీ కి మెదటి హిట్ అందించిన దర్శకుడిగా సుకుమార్ ని చెప్పుకోవచ్చు. ఆర్య మూవీ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ తో తెరకెక్కి బన్నీకి యూత్ లో మంచి గుర్తింపు తెచ్చింది. ఇక దీనికి సీక్వెల్ గా ఆర్య 2చేయగా ఆర్య అంత కాకపోయినా హిట్ ఫిల్మ్ గా నిలిచింది.ఐతే ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న చిత్రం పై భారీ అంచనాలున్నాయి.ఈ మూవీ గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ అని సమాచారం. మరి ఈ ఇద్దరు హ్యాట్రిక్ చిత్రాల దర్శకులు బన్నీకి హ్యాట్రిక్ ఇస్తారో లేదో చూడాలి