హీరోగా బాగా బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. కింగ్ ఆఫ్ ది హిల్ పేరిట నిర్మాణ సంస్థను నెలకొల్పి మొదటి చిత్రంగా ‘మీకు మాత్రమే చెప్తా’ను నిర్మిస్తున్నాడు. ఇందులో ‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ మెయిన్ లీడ్ చేస్తున్నాడు.

నూతన దర్శకుదు షమ్మీర్ సుల్తాన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ముగియగా టీజర్ సిద్దం చేశారు టీమ్. రేపు సాయంత్రం 6 గంటల 2 నిముషాలకు ఈ టీజర్ విడుదలకానుంది. ఇందులో అనసూయ భరద్వాజ్, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్ కీలక పాత్రలు చేస్తున్నారు. మరి దేవరకొండ మొదటి వెంచర్ ఎలా ఉంటుందో ఒక ఐడియా రావాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.