హీరోయిన్ నిత్యా మీనన్ నటించింది తెలుగులో కొద్ది సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచిత హీరోయిన్.తెలుగులో మొదటి సినిమా అలా మొదలైంది చిత్రం తోనే ఆమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నటించిన ఇష్క్, గుండెజారి గల్లంతైయ్యిందే, జనతా గ్యారేజ్ , సన్ అఫ్ సత్యమూర్తి చిత్రాలు సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఇటీవల మిషన్ మంగళ్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ అందుకొని లక్కీ హీరోయిన్ అని నిరూపించుకున్నారు.

కాగా తాజాగా నిత్యా తన చిత్రం 50వ కోసం రెడీ అవుతున్నారు. ‘ఆరం తిరుకల్పన’ పేరుతో తెరకెక్కనున్న ఈ మలయాళ చిత్రం తెలుగు, తమిళ భాషలలో విడుదలయ్యే అవకాశం కలదు. జాతుల వలసలు వంటి ఓ భిన్నమైన కథతో వినూత్నంగా దర్శకుడు అజయ్ దేవలోక తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ ని నిత్యా మీనన్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, త్వరలో మొదలుకానుంది అని రాయడం జరిగింది.