మూడోసారి వారి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఎవరు వారు అనుకుంటున్నారా..దర్శకుడు గౌతమ్ మీనన్..నటుడు సూర్య. వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు హిట్టే. ఇప్పుడు మూడో  సినిమా కోసం ఈ కాంబినేషన్‌ కలవబోతోందని చెన్నై టాక్‌. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్‌ నిర్మించనుందట. ఈ నెల 20న విడుదల కానున్న సూర్య చేసిన ‘కాప్పాన్‌’ (‘బందోబస్త్‌’)ను లైకా సంస్థే నిర్మించింది. తాజా చిత్రం త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది.