చైనాలో ఈ రోజు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం 2.0రిలీజ్ అయింది. ఈ విషయాన్ని సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో విలన్ గా నటించాడు. 2018లో ఈ చిత్రం భారత్ లో విడుదలయింది. ఈ చిత్రానికి శంకర్ డైరెక్టర్. ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.