ఒకప్పుడు స్టార్ హీరోలతో భారీ హిట్లు తీసిన దర్శకుడు వివి.వినాయక్ త్వరలో నటుడిగా మారబోతున్న సంగతి తెలిసిందే. ‘శరభ’ ఫేమ్ నరసింహా డైరెక్ట్ చేయనున్న సినిమాలో వినాయక్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. షూటింగ్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ అలా ఉండగానే దర్శకుడిగా కమ్ బ్యాక్ అవడానికి ట్రై చేస్తున్నారట వినాయక్.

ఇప్పటికే కథను సిద్దం చేసుకుని ఒక యంగ్ హీరోతో చర్చలు జరుపుతున్నారట. అన్నీ కలిసొస్తే తాను నటిస్తున్న సినిమా పూర్తవగానే మెగా ఫోన్ పట్టుకోవాలని వినాయక్ భావిస్తున్నారని టాక్. ఒకవేళ ఇదే నిజమైతే ‘ఖైదీ నెం 150’ మినహా ‘అఖిల్, ఇంటెలిజెంట్’ లాంటి డిజాస్టర్లతో నిరాశపరిచిన వినాయక్ ఈసారైనా మారిన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమా తీస్తే బాగుండు.