హైదరాబాద్‌: కన్నడ స్టార్‌ సుదీప్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'పహిల్వాన్‌'. ఎస్‌.కృష్ణ దర్శకుడు. ఆకాంక్ష సింగ్‌ కథానాయిక. సునీల్‌శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం రాత్రి 'పహిల్వాన్‌' ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది. ఈ సందర్భంగా మేకింగ్‌ వీడియోను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది.

తెలుగులో వారాహి చలన చిత్రం ఈ సినిమాను విడుదల చేస్తోంది. అర్జున్‌ జన్యా స్వరాలు సమకూరుస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో 'పహిల్వాన్‌' సినిమా విడుదల కానుంది. 'ఈగ'లో ప్రతినాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సుదీప్‌... ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న 'సైరా'లో అవుకు రాజుగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.