బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఏది చేసినా సంచలనమే. ప్రతి విషయంలో తన మార్క్ స్పీడ్ చూపిస్తూ మిగతా వారికంటే తాను ప్రత్యేకం అని గుర్తు చేస్తుంటారు. ఈ కండల వీరుడు చేసిన తాజా సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయంలోకి వెళితే ప్రస్తుతం సల్మాన్ దబాంగ్ 3లో నటిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రభుదేవా తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనడానికి సల్మాన్ ఏకంగా ముంబై రోడ్లపై సైకిల్ రైడ్ చేశారు. జోరు వానలో రైన్ కోట్, షార్ట్ , హాట్ ధరించినసల్మాన్ స్కూల్ బాయ్ లా సైకిల్ పై ఉత్సాహంగా వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. హఠాత్తుగా రోడ్ పై సల్మాన్ ని చూసిన కొందరు షాక్ తిన్నారు.చాలా మంది తమ కెమెరాలకు పని చెప్పారు. కాగా దబాంగ్ 3 డిసెంబర్ 20న విడుదల కానుంది. దబాంగ్ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కూడా సల్మాన్ సరసన సోనాక్షి నటిస్తున్నారు.