‘ఆర్‌ఎక్స్‌ 100′ సినిమా నిర్మించిన కార్తికేయ క్రియేటివ్‌ వర్క్స్‌ మళ్లిd కార్తికేయతో తదుపరి చిత్రాన్ని నిర్మిస్తోంది. సినిమా పేరు ’90 ఎంఎల్‌’. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నేహా సోలంకి హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజా చిత్రం ’90 ఎంఎల్‌’ గురించి నిర్మాత అశోక్‌ రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ ”ఒక మంచి సినిమా తీస్తే పరిశ్రమలో గుర్తింపు ఎలా ఉంటుందో, గౌరవం ఎంత గొప్పగా దక్కుతుందో మాకు ఆర్‌ఎక్స్‌ 100 ద్వారా తెలిసింది. ఈ చిత్రం మా హీరో కార్తికేయకు బిగ్‌ బ్రేక్‌ ఇచ్చింది. ఇప్పుడు మా కాంబినేషన్‌లో మరో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ తాజా చిత్రానికి 90 ఎంఎల్‌ అని పేరు పెట్టాం. టైటిల్‌కు తగినట్టుగానే వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పటికి 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు కొత్తవాడైనా బాగా తీస్తున్నారు” అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ”కార్తికేయ అనగానే ఎవరికైనా ‘ఆర్‌ఎక్స్‌ 100′ గుర్తుకొస్తుంది. ఎంతో మందికి ఆ సినిమా ఓ రెఫరెన్స్‌గా మిగిలింది. వాటిని దృష్టిలో పెట్టుకునే అంతకుమించి ఉండేలా ’90 ఎంఎల్‌’ కథ రాసుకున్నాను. పూర్తిస్థాయిలో ఎంటర్‌టైన్‌చేసే కథ ఇది. ’90 ఎంఎ’ అని టైటిల్‌ చెప్పగానే చాలా మంది ఇంట్రస్టింగ్‌ అని అన్నారు. సినిమా కూడా ఆసక్తికరంగా వస్తోంది. ఆరు పాటలుంటాయి. అనూుప్‌ రూబెన్స్‌ చాలా మంచి బాణీలు ఇచ్చారు. ఈ నెల 11 నుంచి పతాక సన్నివేశాలను తెరకెక్కిస్తాం. ఆ తర్వాత జరిగే మరో షెడ్యూల్‌తో షూటింగ్‌ పూర్తవుతుంది” అన్నారు. ఇతర పాత్రల్లో రవికిషన్‌, రావు రమేష్‌, అలీ పోసాని కృష్ణమురళి, అజయ్‌, కాలకేయ ప్రభాకర్‌, ప్రగతి, తాగుబోతు రమేష్‌, దువ్వాసి మోహన్‌ తదితరులు నటిస్తున్నారు. పాటలు: చంద్రబోస్‌, ఛాయాగ్రహణం: జె.యువరాజ్‌.