రాయలసీమ లవ్ స్టోరీ కథని రెడీ చేసుకొని నిర్మాతల కోసం ఎదురు చూస్తున్న సమయంలో పంచలింగాల బ్రదర్స్ అయిన రాయల్ చిన్నా , నాగరాజులు కథ విన్నారు. వాళ్ళు కూడా కథలో లీనం కావడం వల్ల సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి 11 గంటల వరకు సమయం గడిచిపోయింది. కథ విన్నాక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే మనం ఈ సినిమా చేస్తున్నామని చెప్పి నన్ను ప్రోత్సహించారు. నిర్మాతల సహకారం వల్ల కథ చెప్పిన 10 రోజుల్లోనే సెట్స్ మీదకు తీసుకెళ్లడం జరిగింది. సినిమా స్టార్ట్ అయ్యాక ఎక్కడ కూడా రాజీపడకుండా అన్ని సమకూర్చారు, దాంతో అనుకున్న దానికంటే బాగా తీయగలిగాను, అందుకు సాంకేతిక నిపుణులు మాత్రమే కాదు నటీనటుల సహాయ సహకారాలను కూడా మర్చిపోలేను.

రాయలసీమ లవ్ స్టోరీ ఔట్ పుట్ బాగా వచ్చింది దాంతో తప్పకుండా సూపర్ హిట్ కొట్టడం ఖాయమని ధీమాగా ఉంది మా టీమ్. మా సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరూ తమ సొంత సినిమాగా భావించి పని చేసారు అందుకు గాను నాకు సహకరించిన ప్రతీ ఒక్కరికి ఈ సందర్బంగా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక రాయలసీమ లవ్ స్టోరీ చిత్రంతో నన్ను దర్శకుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్న మా నిర్మాతలు రాయల్ చిన్నా – నాగరాజు గార్లకు జీవితాంతం రుణపడి ఉంటాను. నన్ను నమ్మి, ఈ కథని నమ్మి సినిమా తీశారు , సెప్టెంబర్ 27 న మా సినిమా విడుదల అవుతోంది పెద్ద ఎత్తున విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు యంగ్ డైరెక్టర్ రామ్ రణధీర్.