అక్కినేని నాగ‌చైత‌న్య వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నారు. ఈ ఏడాది `మ‌జిలీ`తో హిట్ కొట్టిన చైత‌న్య‌ ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో సాయిప‌ల్ల‌వితో క‌లిసి ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇది పూర్తి కాగానే అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో చైత‌న్య మ‌రో సినిమా చేసే అవ‌శాలున్నాయి. దీనికి సంబంధించిన తుది ద‌శ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అయితే త్వ‌ర‌లోనే చైత‌న్య ఓ బాలీవుడ్ చిత్రంలో న‌టించ‌బోతున్నార‌నే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. స‌మాచారం మేర నిర్మాత దిల్‌రాజు బాలీవుడ్ చిత్రం `బ‌దాయి హో` సినిమా తెలుగు రీమేక్ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నార‌నే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. దిల్‌రాజు, బోనీక‌పూర్‌లు ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించ‌నున్నార‌ట‌. ఈ చిత్రంలో చైత‌న్య న‌టించ‌డానికి ఓకే చెప్పార‌ని టాక్‌. మ‌రి సోష‌ల్‌మీడియాలో విన‌ప‌డుతోన్న ఈ వార్త‌ల‌కు ఏమైనా రిప్లై వ‌స్తుందేమో వేచి చూడాలి.