నేచురల్‌ స్టార్‌ నాని, డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌ లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకం పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తోంది. కాగా తాజాగా నాని ప్రీ రిలీజ్ ప్రమోషన్ లో భాగంగా గ్యాంగ్ లీడర్ టీమ్ రాజమండ్రిలో ప్రమోషన్స్ నిర్వహించారు. అలాగే ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఇప్పటికే గ్యాంగ్ లీడర్ వైజాగ్ కి వెళ్ళింది. కాగా ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందట. సరికొత్త కంటెంట్ తో రివేంజ్ డ్రామాతో సాగే కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉండనుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో నాని సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తుండగా, ఆర్ఎక్స్ 100′ హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు. ఇతర కీలక పాత్రల్లో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రఘుబాబు, సత్య నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.