బాహుబలి పుణ్యమాని తెలుగు సినిమా ఖ్యాతి మరింత పెరిగింది.ఆ ఒక్క సినిమా తర్వాత నుంచి మన దేశ వ్యాప్తంగా సినిమాలు భారీ ఎత్తున విడుదల అవుతున్నాయి.అలా అందరి హీరోల సినిమాలు అన్ని సినిమాలు కాదు.స్టార్ హీరో మరియు అందులోనూ భారీ బడ్జెట్ చిత్రం అయితే తప్ప ఇండియా వైడ్ గా భారీ ఎత్తున విడుదల కావు.అలాంటి చిత్రాలను మాత్రమే పాన్ ఇండియన్ చిత్రంగా పరిగణించి గర్వంగా చెప్పుకుంటారు.

తాజాగా అదే స్థాయిలో ప్రభాస్ నటించిన “సాహో” విడుదల అయ్యింది.మళ్ళీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన “సైరా నరసింహా రెడ్డి” చిత్రం ఆ రేంజ్ భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది.మొట్టమొదటి భారతదేశ విప్లవకారుడు అయినటువంటి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అసలైన పాన్ ఇండియన్ సినిమా అంటే ఎలా ఉంటుందో చూపిస్తుందని సైరా యూనిట్ చాలా నమ్మకంగా చెప్తుంది.

ఈ సినిమాలో ఉండే భావోద్వేగాలు,యాక్షన్ సీక్వెన్సులు మరో స్థాయిలో ఉంటాయని చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి తెలుపుతున్నారు.ఖచ్చితంగా సైరా పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ సినిమాగా పరిగణించవచ్చని తెలిపారు.అగ్ర తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.