ప్రిన్స్ మహేష్,రష్మిక మందాన ప్రధాన పాత్రలలో డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం “సరిలేరు నీకెవ్వరూ”. ఈ మూవీ ప్రస్తుతం కాశ్మీర్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రిన్స్ మహేష్ మొదటిసారి ఆర్మీ మేజర్ గా చేస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి,రాజేంద్రప్రసాద్,జగపతిబాబు వంటి నటులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారని సమాచారం.

ఇటీవలే ఈ మూవీ లోని మహేష్ ఆర్మీ మేజర్ లుక్ సోషల్ మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా నేడు దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రం లో మహేష్ పేరు ని రివీల్ చేస్తూ ట్విట్టర్లో ఓ ఫోటో షేర్ చేశారు. ఆర్మీ మేజర్ అయిన మహేష్ పాత్ర పేరు అజయ్ కృష్ణ అట. ఆపేరు రాసివున్న బ్యాడ్జి ఫోటోను షేర్ చేయడం ద్వారా దర్శకుడు తెలియపరిచారు. సంక్రాంతి కానుకగా రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.