ఏ పాత్రనైనా అలవోకగా చేసే హీరోయిన్ లలో మేటి ఐన అనుష్క, భాగమతి తర్వాత ఒక విలక్షణ పాత్రని నిశ్శబ్దం చిత్రం లో పోషిస్తున్నారు. పోస్టర్ లోనే, తన కి సంబందించిన పాత్రని వివరించే ప్రయత్నం చేసింది చిత్ర బృందం. నిశ్శబ్దం అని టైటిల్ కింద “సాక్షి ఏ మ్యూట్ ఆర్టిస్ట్” అని టాగ్ లైన్ వుంది. ఈ పోస్టర్ లో అనుష్క పక్కకి తిరిగి పెయింటింగ్ వేస్తున్నట్లుగా వుంది. చాల గ్యాప్ తరువాత ఈ చిత్రం రావడం తో అనుష్క ఫ్యాన్స్ ఆనందం లో వున్నారు. అరుంధతి, భాగమతి లతో ఫుల్ లెంగ్త్ పెర్ఫర్మ్ చేసిన అనుష్క మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపనుంది.

ఈ చిత్రానికి మంత్ మధుకర్ దర్శకత్వం వహించగా, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజ్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హాలీవుడ్ స్టార్ అయినా మైఖేల్ మ్యాడ్సన్ ముఖ్య పాత్రలో నటించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో కోన ఫిలిం కార్పొరేషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అనుష్క లీడ్ రోల్ చేస్తుండగా ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయని అర్ధం అవుతుంది.