వెండితెరపై పవర్‌స్టార్‌గా వెలిగి కలెక్షన్ల వర్షం కురిపించిన పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడిగా మారి సినిమాలకు దూరమైపోయారు. అయితే అభిమానులు, సన్నిహితులు మాత్రం పవన్ మళ్లీ సినిమాలు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ సినిమా రంగానికి పూర్తిగా దూరం జరగకూడదని పవన్ కూడా అనుకుంటున్నారు.
 
ఈ నేపథ్యంలో పవన్ సినిమాల్లో కూడా కొనసాగబోతున్నట్టు సమాచారం. అయితే పవన్ మళ్లీ సినిమాల్లో నటించేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉన్నప్పటికీ.. నిర్మాతగా మారాలని పవన్ అనుకుంటున్నారట. మెగా హీరోలు రామ్‌చరణ్ తేజ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా సినిమాలు చేయాలనుకుంటున్నారట. మంచి కథలు ఉంటే విని, తన వద్దకు తీసుకురమ్మని వారికి పవన్ సూచించారట. మంచి కథ దొరికితే వీరిలో ఎవరో ఒక హీరోతో సినిమాను ప్రారంభించాలని పవన్ అనుకుంటున్నట్టు సమాచారం.