గత ఏడాది విడుదలైన బాలీవుడ్‌ చిత్రం ‘అంధాదున్‌' విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్నది. ఈ సినిమాలో అద్వితీయ అభినయాన్ని కనబరిచిన హీరో ఆయుష్మాన్‌ ఖురానా ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్నారు.ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రీమేక్‌లో నితిన్‌ కథానాయకుడిగా నటించనున్నట్లు సమాచారం. స్వీయ నిర్మాణ సంస్థ శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై నితిన్‌ తండ్రి సుధాకర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు చెబుతున్నారు. ‘రాక్షసుడు’ సినిమాతో విజయాల బాట పట్టిన రమేష్‌వర్మఈ రీమేక్‌కు దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.