గత రెండేళ్లుగా చక్కటి విజయాలతో దూసుకుపోతున్నారు యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌. కథాంశాల ఎంపికలో కూడా వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘వాల్మీకి’ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకులముందుకురానున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన తదుపరి సినిమాకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఆయన ఓ సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్‌ సంస్థ తెరకెక్కించనుంది. కమర్షియల్‌ అంశాలతో వినోదాన్ని మేళవించి మేర్లపాక గాంధీ చెప్పిక కథ నచ్చడంతో ఈ సినిమాకు వరుణ్‌తేజ్‌ వెంటనే అంగీకరించారని చెబుతున్నారు. ఈ ఏడాది చివరలో చిత్రీకరణ ప్రారంభించి 2020 వేసవిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని చెబుతున్నారు.