ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు హైదరాబాద్ వాసులందరికి ఆరోగ్య పరమైన జాగ్రత్తలు వివరిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల డెంగ్యూ జ్వరాలు విజృంభించిన సంగతి మనకు తెలిసిందే. దాని వలన చాలా మంది తమ ప్రాణాలను విడిచారు కూడా. అయితే ఈ దోమల నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని తెలంగాణ న్యాయస్థానం కూడా పలు ఆదేశాలు జారీ చేసిన సంగతి మనకు తెలిసిందే. దానికి తోడు తెలంగాణ ప్రభుత్వం ఈ దోమల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుందో వివరించాలని కోరారు. అయితే ఈమేరకు సోషల్ మీడియా వేదికగా పురపాలక శాఖ మంత్రి కెటీఆర్ ట్వీట్ చేస్తూ జ్వరాల బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా ఈ కాలంలో ఎలా ఉండాలి అని పలు జాగ్రతలు సూచించారు.
ఇకపోతే మహేష్ బాబు కూడా కేటీఆర్ కి మద్దతుగా ఒక ట్వీట్ చేశారు. అయితే మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి,నీరు నిల్వ లేకుండా చూసుకోండి. అప్రమత్తంగా ఉండటంతో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోండి హైదరాబాద్ ప్రజలారా’ అంటూ మహేష్ ట్వీట్ చేశారు. అయితే మహేష్ చేసిన ఈ ట్వీట్ పై భిన్నమైన కథనాలు వెలువడుతున్నాయి… తెలంగాణ ప్రభుత్వానికి తన వంతు మద్దతు తెలుపుతానని మహేష్ బాబు వెల్లడించారు.