తమిళ సినీ పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ దర్శకుల్లో యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ కూడా ఒకరు. ఇటీవలే సూపర్ స్టార్ రజనీతో ‘పేటా’ సినిమా చేసి విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు తన తరవాతి సినిమాను రజనీ అల్లుడు, స్టార్ హీరో ధ‌నుష్‌తో చేయడానికి సిద్ధమయ్యారు. ధనుష్ కోసం కార్తిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాను రెడీ చేసినట్టు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం వెట్రిమారన్ డైరెక్షన్లో చేస్తున్న ‘అసుర’, దురై సెంథిల్ కుమార్ డైరెక్షన్లో చేస్తున్న ఇంకో సినిమా పూర్తయ్యాక సుబ్బరాజ్ సినిమాను స్టార్ట్ చేస్తారట ధనుష్. మొదటిసారి ధనుష్, కార్తిక్ కలిసి సినిమా చేయనుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఇప్పటి నుండే మొదలయ్యాయి.