మెగా స్టార్ చిరంజీవి తన డ్రీం ప్రాజెక్ట్ కోసం ఎన్నో రోజులు కష్టపడి తీసిన చిత్రం అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రానికి సంబందించిన అన్ని పనులను పూర్తీ చేసుకొని థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ఎపుడెపుడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ని చిత్ర బృందం సెప్టెంబర్ 15 వ తారీఖు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుసుటనుండి. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రం దాదాపు 300 కోట్లతో నిర్మాణమైంది. అభిమానుల మధ్యనే ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ని విడుదల చేయలని భావిస్తున్నట్లు సమాచారం .
ఈ చిత్రానికి సంబందించిన ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని కూడా చాల గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తోంది. రామ్ చరణే ప్రొడ్యూసర్ కావడంతో క్వాలిటీ, ఈవెంట్స్ విషయం లో ఏ మాత్రం కాంప్రమైస్ కావడం లేదు. ఈ చిత్రం లోచిరంజీవి సరసన నయన తార హీరోయిన్ గా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్ చిరు కి గురువు పాత్రలో నటిస్తున్నారు. సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా ఈ చిత్రం లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం మనందరికీ తెలిసిందే .