సందీప్ కిషన్ హీరోగా అన్య సింగ్ హీరోయిన్ గా రాబోతున్న ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’ చిత్రం ఈ నెల 12న విడుడల కానుంది. కార్తీక్ రాజు దర్శకుడు. కాగా తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A ‘ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది ఈ చిత్రం.

వెంకటాద్రి టాకీస్ వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాల పై ఈ సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాతలు. మరి గత కొన్ని సినిమాలుగా సరైన హిట్ లేక బాక్సాఫీస్ వద్ద వెనుకపడిపోయిన సందీప్ కిషన్ కెరీర్ కి ఈ చిత్రం హిట్ అవడం అత్యవసరవం. కాగా ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’ సందీప్ కి హిట్ ఇస్తోందో లేదో చూడాలి.