హీరో నాని గ్యాంగ్ లీడర్ నేటి నుండి థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే యూఎస్ ప్రీమియర్స్ ద్వారా అందిన సమాచారం ప్రకారం గ్యాంగ్ లీడర్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది. నాని కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో ఓ ఫన్నీ పోస్ట్ చేయడం ద్వారా తన ఫ్యాన్స్ కి చిన్న విన్నపం చేశారు. నటి లక్ష్మీ భుజం పై వాలి నిద్ర పోతున్న ఫోటో పెట్టి…”గ్యాంగ్ లీడర్ హిట్ ఐతే లేపండి, లేకుంటే డిస్ట్రబ్ చెయ్యొద్దు, గ్యాంగ్ లీడర్ మీ మూవీ, మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను, మీ పెన్సిల్ పార్థసారథి” అని ట్విట్టర్ సందేశం ఇచ్చారు. నాని విన్నపం తో కూడిన ప్రచారం చాలా బాగుంది.

విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని హాస్యంతో సాగే ఎమోషనల్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కించాడని తెలుస్తుంది. నాని తో కూడిన ఐదుగురు ఆడవాళ్ల సాహసాల సమాహారమే గ్యాంగ్ లీడర్. యంగ్ హీరో కార్తికేయ ప్రతి నాయకుడి పాత్రలో కనిపిస్తుండగా, ప్రియాంక అరుళ్ మోహన్ నాని సరసన హీరోయిన్ గా నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.