గత శుక్రవారం విడుదలైన నాని చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ మూడు రోజుల్లో మంచి వసూళ్లనే రాబట్టింది. మొదటిరోజు మంచి ఓపెనింగ్స్ అందుకున్న చిత్రం పాజిటివ్ టాక్ మూలాన శని, ఆదివారాల్లో మంచి పెర్ఫార్మెన్స్ కనబర్చింది. ‘సాహో’ మినహా వేరే చిత్రం లేకపోవడం కూడా చిత్రానికి బాగా కలిసొచ్చింది. అత్యధికంగా నైజాం ఏరియాలో మూడు రోజులకు కలిపి రూ.4.69 కోట్ల షేర్ అందుకున్న సినిమాకు మిగతా ఎరియాల్లో కూడా మంచి రన్ దొరికింది.

ఆంధ్రాలో రూ.5.58 కోట్లు, సీడెడ్ ఏరియాలో రూ.1.41 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో రూ.11.65 కోట్ల షేర్ ఖాతాలో వేసుకుంది. రెస్ట్ ఆఫ్ ఏపీ, తెలంగాణతో పాటు ఓవర్సీస్ వసూళ్లను కూడా కలుపుకుంటే ఈ మొత్తం షేర్ రూ. 15.7 కోట్ల వరకు ఉంది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.30 కోట్ల వరకు ఉండటంతో ఇంకో 10 రోజుల వరకు ఆక్యుపెన్సి బాగుంటే ఆ మొత్తం వెనక్కి రాబట్టగలదు చిత్రం.