మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సోషమ్ మీడియాలో అంత యాక్టీవ్ గా ఉండరనే చెప్పాలి. మిగతా స్టార్ హీరోలందరు ఎప్పటికప్పుడూ తమ సమాచారాన్ని అభిమానులతో పంచుకుంటూ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటే రామ్ చరణ్ మాత్రం ఈ విషయంలో వెనకబడిపోతున్నారు. అందుకే ఈ బాధ్యతను సోషల్ మీడియాలో చురుక్కా ఉండే ఉపాసన నెరవేర్చేవారు. ఐతే ఈ మధ్య రామ్ చరణ్ తాను ఇంస్టాగ్రామ్ ఖాతా తెరుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది.

దీనితో రామ్ చరణ్ ఇవాళ మొదటి పోస్ట్ చేశారు. తన అమ్మతో చిన్నప్పుడు తీసుకున్న ఫొటోను.. ఇప్పుడు తీసుకున్న ఫొటోను రెండింటిని పోస్ట్ చేసిన చెర్రీ.. ‘‘కొన్ని ఎప్పటికీ మారవు. నా మొదటి ఫొటోను నీకే అంకితం చేస్తున్నా. లవ్ యు అమ్మ. మమ్మాస్ బోయ్ ఫరెవర్’’ అంటూ కామెంట్ పెట్టాడు. ఆ ఫొటోలో చెర్రీ చాలా క్యూట్‌గా ఉన్నాడు.