మహానటి చిత్రం తో ఎంతగానో పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్, ప్రస్తుతం మిస్ ఇండియా సినిమా లో నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. అయితే ఇటీవలే రానా ఒక కొత్త చిత్రాన్ని ఓకే చేసారు. ఈ చిత్రం లో హీరోకి సమానంగా వుండే ఒక పోలీస్ పాత్రకు కీర్తి సురేష్ ని సంప్రదించగా తాను నో చెప్పింది. అయితే మిస్ ఇండియా చిత్రం తరువాత కీర్తి సురేష్ డేట్స్ ఖాళీ అనే చెప్పాలి. కానీ ఈ చిత్రం లో నటించడానికి తనకి ఇబ్బంది ఏంటో అర్ధం కావడం లేదు.
ఈ చిత్రానికి దర్శకుడు మిలింద్ రావు, గతం లో సిద్దార్థ్, ఆండ్రియా జంటగా నటించిన గృహం సినిమా కి దర్శకత్వం వహించింది ఈయనే. రానా ఓకే చేసిన చిత్రం కూడా హార్రర్ అండ్ క్రైమ్ జోనర్ కి సంబంధించింది. ఐతే గృహం సినిమాలో రొమాన్స్ బాగానే వుంది. ఈ చిత్రంలో కూడా రొమాన్స్ సన్నివేశాలు ఉంటే అది కీర్తి సురేష్ కి ఇబ్బంది అనే చెప్పాలి. లేదంటే పోలీస్ పాత్ర నచ్చక ఒప్పుకోలేదని అనుకోవాలి. మరి కీర్తి సురేష్ అందుకు అంగీకరించలేదో ప్రస్తుతానికి సస్పెన్సు గానే మిగిలి వుంది. ఈ చిత్రానికి అన్ని ఓకే అయితే నవంబర్ లో షూటింగ్ అయ్యే ఛాన్స్ వుంది. రానా బాహబలి చిత్రం తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన విషయం అందరికి తెలిసిందే.