నటుడు  అల్లు అర్జున్ తో  క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడు దర్శకుడు సుకుమార్. శేషచలం అటవీ నేపథ్యంలో గంధపు అక్రమ రవాణాకి సంబంధించి ఈ సినిమా ఉంటుంద‌ట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంధాన హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇందులో ర‌ష్మిక ప‌ల్లెటూరి భామ‌గా క‌నిపించ‌నుందట‌. మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ  ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు.