సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా కె.వి.ఆర్ మ‌హేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘దొరసాని’ చిత్రం ఈ రోజే విడుదల అయింది. బలమైన నేపథ్యంతో భావేద్వేగమైన ప్రేమ కథతో వచ్చిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ రాజు అనే తక్కువ కులానికి చెందిన కుర్రాడిగా నటించాడు. రాజు పాత్రలో ఆనంద్ దేవరకొండ చాలా బాగా నటించాడు. మెయిన్ గా సహజంగా కనిపిస్తూ తన పాత్ర కోసం న్యూడ్ గా కూడా కనిపించి.. అందర్నీ షాక్ కి గురిచేశాడు.

సెకెండ్ హాఫ్ లో వచ్చే ఈ షాట్స్ సినిమాలో ఓ ముఖ్యమైన సన్నివేశంలో వస్తాయి. ఇక సినిమాలో స్వచ్ఛమైన ప్రేమికుడిగా ఆనంద్ దేవరకొండ కనిపిస్తాడు. తన ప్రేమే ఒక ఉద్యమంలా భావించే ప్రేమికుడిగా ఆనంద్ దేవరకొండ బాగా నటించాడని ఆనంద్ కి మంచి పేరు వస్తోంది. ఏమైనా ఆనంద్ దేవరకొండ మొదటి సినిమాలోనే తన పాత్ర కోసం న్యూడ్ గా నటించడం విశేషమే. అలాగే జీవితా రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మికను ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.