సైరా ట్రైలర్ దేశవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంది. దేశంలో ని ఐదు ప్రధాన భాషలలో విడుదల అవుతున్న సైరా మూవీ ట్రైలర్ అన్ని భాషలలో కలిపి 24గంటల వ్యవధిలో 34మిలియన్స్ పైగా వ్యూస్ సాధించడం విశేషం. మొదటి తరం స్వాతంత్ర్య సమరయోధుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా చేస్తున్న చిరంజీవి నటవిశ్వరూపానికి సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.

ఇప్పటికే టాలీవుడ్ మరియు బాలీవుడ్ ప్రముఖులైన రాజమౌళి, మహేష్, సల్మాన్ వంటివారు సైరా ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు. ఈ లిస్ట్ లోకి బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా చేరారు. ట్విట్టర్ వేదికగా ఆయన సైరా ట్రైలర్ బాగుందని, ఆ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూసున్నానంటూ ట్వీట్ చేశారు. ఆయన నేను చిరంజీవి కి పెద్ద అభిమానిని అని చెప్పడం మరో విశేషం.

కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార, తమన్నా నటిస్తుండగా…,అమితాబ్,జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర కీలకపాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం అమిత్ త్రివేది.