‘నాకు ఇష్టమైన వంటకాలు హాయిగా తింటానని తెలిపింది నటి రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఏది తిన్నా ఓ పద్ధతి ప్రకారం తింటా. మనకసలు డైటింగ్ అన్న మాటే నచ్చదని స్పష్టం చేసింది. అంతేకాదు ‘మన దగ్గర డైటింగ్ పేరుతో నోరు కట్టేయడం లాంటిది అసలు ఉండబోదని తేల్చి చెప్పింది ఈ స్లిమ్ బ్యూటీ. అంత తిన్నా ఇంత స్లిమ్ గా ఉందంటే కారణం అందరికీ తెలిసిందే. తిన్నంత తిని ఆ తర్వాత జిమ్ బాట పడుతుంది ఈ భామ.