యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్’. కాగా ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా అక్టోబర్ 18న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ లాంటి ఫుల్ ఎంటర్ టైనర్ తో మంచి హిట్ అందుకున్న సందీప్ కిషన్, మళ్లీ ఆ తరువాత ఆ స్థాయిలో కామెడీ సినిమాను చెయ్యలేదు.

అందుకే ఈ సారి ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాని చేసి.. సూపర్ హిట్ అందుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ ‘తెనాలి రామకృష్ణ’ సినిమాని చేస్తోన్నాడట. ముఖ్యంగా ఈ చిత్రంలో సిచ్యుయేషన్ కామెడీ చాలా బాగా వస్తోందని సమాచారం. సందీప్ కిషన్ చుట్టూ జరిగే డ్రామా.. ఆ డ్రామా కారణంగా హీరో పడే ఇబ్బందులు.. ఆ ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికి హీరో చేసే పనులు.. ఆ పనులకు మిగిలిన పాత్రలు ఎలాంటి సమస్యలను ఎదురుకున్నాయి, లాంటి అంశాల చుట్టూ ఈ సినిమా సాగుతుందట.

మొత్తానికి తెనాలి రామకృష్ణ ఫుల్ గా నవ్విస్తాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన హన్సిక కథానాయకిగా నటిస్తోంది. ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.