చందమామ కాజల్ ని పెళ్లి చేసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు.అలాంటి కోరిక కలిగిన కాజల్ అభిమాని ఒకరు ఆమెకు ట్విట్టర్ సందేశం పంపారు. నేను మిమ్ముల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. మరి మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటానని అతను ట్వీట్ చేయగా, ఆశ్చర్యకరంగా కాజల్ ఆ ట్వీట్ కి స్పందించారు.

ఆ నెటిజెన్ కి ఓ చిలిపి సమాధానం ఇచ్చారు. “కొంచెం ప్రయత్నం చేయండి. అంత సులభంగా జరగదు” అని అతని ట్వీట్ కి సమాధానం ఇవ్వడం జరిగింది. ఎదో వ్యాపకంగా పెట్టిన ట్వీట్ కి ఏకంగా కాజల్ రిప్లై ఇవ్వడంతో మనవాడి ఆనందానికి హద్దులు లేకుండా పోయిందట.

ఇటీవల సీత, రణరంగం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కాజల్, తమిళంలో ప్యారీస్ ప్యారీస్, భారతీయుడు చిత్రాలతో పాటు మరో హిందీ చిత్రం లో నటిస్తున్నారు.హీరో గోపి చంద్ కొత్త చిత్రం లో కాజల్ చేసే అవకాశం కలదు.